- కేపీహెచ్బీ యాదవ సంఘం ఆధ్వర్యంలో.. న్యూఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : కేపీహెచ్బీ యాదవ సంఘం ఆధ్వర్యంలో.. నూతన సంవత్సరం క్యాలెండర్ ను బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అల్లం వెంకటేశ్వర్లు, బిల్డర్ రమణ యాదవ్, శంకరయ్య యాదవ్, గిరి యాదవ్ మరియు యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఆవిష్కరణ అనంతరం భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ ఐక్యమత్యంతో సంఘం బలోపేతానికి కృషి చేయాలని, యాదవులు రాజకీయంగా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

యాదవులు రాజకీయంగా ఎదగాలని, ప్రభుత్వం ఇచ్చే ఫలాలన్ని అందిపుచ్చుకొని అన్ని రంగాల ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు.





