శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): హుడా కాలనీలోని టీ టైం ముందు భాగంలో ప్రకృతి విపత్తు కారణంగా భారీ చెట్టు విరిగి రోడ్డుపై అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన వల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతోపాటు స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని బీజేపీ హఫీజ్‌పేట డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ వెంకటరమణ, బీజేవైఎం నాయకులు విష్ణుదత్, పవన్ డిమాండ్ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.






