నమస్తే శేరీలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రులు ఉత్సవంగా జరిగాయి. శ్రీ విజయ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో న్యూ కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. గణనాధులకు విశేష పూజలు అందించడమే కాకుండా భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు లడ్డూ వేలం పాట నిర్వహించగా.. మూడు లక్షల ఒక రూపాయికి పలికింది. ఆ లడ్డుని బిఎస్ఎన్ యాదవ్ కుమారులు కిషోర్ యాదవ్, కిరణ్ యాదవ్, సాయి యాదవ్ లు సొంతం చేసుకున్నారు.