నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ లోని శిల్పారామంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం జి. కిషన్ రావు, IAS స్పెషల్ ఆఫీసర్ జెండా వందనం చేశారు. సాయంత్రం ఆంఫి థియేటర్ లో సాయి సేవ సంఘ్ ఆర్గనైజషన్ కళాకారులు ప్రవల్లిక, రేవతి, సుజాత, త్రివేణి, హన్సిక, దీపికా, జ్యోస్నా, భవానీలు (నమో నమో భారతాంబే, అలరిపు, గణేశా పంచరత్న, కావడి చిందు, తిల్లాన, రామ భజన) మొదలైన అంశాలను ప్రదర్శించారు.
వైదేహి సుభాష్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో (వందేమాతరం , నమో భారతంబే, సకలగణాధి) అంశాలను గాయత్రీ, సాత్విక, ప్రాణ్య సాత్విక, వంశిక, స్రుతి, శ్రీకృతి, మీనాక్షి, వైభవి, మోక్షిత, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.