నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలోని సోమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస ధీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని, సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని తెలంగాణ ప్రజలకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని జగదీశ్వర్ గౌడ్ పరమేశ్వరుడిని వేడుకున్నానన్నారు.