- చలివేంద్రం ప్రారంభించిన రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: పేదల, పాదచారుల దాహార్తిని తీర్చడానికి సురభి కాలనీలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ ప్రారంభించారు. లింగంపల్లి డివిజన్, సురభి కాలనీలో కృపాల్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు , పాదచారుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం లింగంపల్లి కంటేస్టేడ్ కార్పొరేటర్ ఏల్లేష్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ వేసవికాలంలో పాదచారులకు, ప్రయానికుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన క్రుపాల్ ని అభినందించారు.
కార్యక్రమంలో శేఖర్, రమేష్, శ్రీను, వెంకటేష్, రమణ కుమార్, జితేంద్ర, వెంకటరావు , పూర్ణ చంద్రశేఖర్, శివకుమార్, రవి, బి.జితేంద్ర, నరసయ్య, సుధా, వీణ, విజయవాణి పాల్గొన్నారు