నమస్తే శేరిలింగంపల్లి: శివరాత్రి పండుగ సందర్భంగా ఆల్విన్ కాలనీ పీజేఆర్ నగరంలో మహా శివుని ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ పాల్గొన్నారు.
అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ వడ్డించారు. కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్ మారెల శ్రీనివాస, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్, పోచయ్య, యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.