పూడికతీత పనులు వేగవంతం చేయాలి

  • ముంపు ప్రాంతాలలో పర్యటన 
  • అధికారులకు  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి: నాలాలలో పూడికతీత పనులు వేగవంతం చేయాలని, చెత్తాచెదారాన్ని తొలగించి, నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బస్ డిపో వద్ద మయూరి నగర్ నుండి వచ్చే నాల ఔట్ లెట్ ను, డోవ కాలనీలో జోనల్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్రంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో ఉండాలని తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.  భారీ వానల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసి అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈ ఈ శ్రీకాంతిని , డిఈ దుర్గ ప్రసాద్, ఏఈ శివ ప్రసాద్, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బీ ఎస్ ఎన్ కిరణ్ యాదవ్, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేకర్ ప్రసాద్ , చంద్రిక ప్రసాద్ గౌడ్, నరేష్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here