నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నాళాలపై శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని హఫీస్ పేట్ ప్రేమ్‌నగర్, దర్గా వద్ద ఉన్న నాలా ప్రాంతాన్ని ఈఈ శ్రీనివాస్ తో కలిసి జోనల్ కమిషనర్ స్నేహా శబరీష్ శనివారం పరిశీలించారు.
అనంతరం ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.