నమస్తే శేరిలింగంపల్లి: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూతల్లేని మ్యాన్ హోల్స్ పొంగి.. రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. మాదాపూర్ డివిజన్ చందా నాయక్ తండాలోని బలహీన సెక్షన్ కాలనీ లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు & రంగారెడ్డి జిల్లా సెయింట్ సెల్ చైర్మన్ టిపిసిసి దేవావత్ సురేష్ నాయక్ పర్యటించి అక్కడ నెలకొన్న ఆయా సమస్యలను పరిశీలించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేదలకు అండగా నిలవాలని అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అనంతరం సమస్య ఉన్న ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. మాదాపూర్ లో నెలకొన్న ఆయా సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.