ఆస్తి హక్కు ధ్రువీకరణ పత్రాలు పంపిణి 

నమస్తే  శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు జీవో 58, 59 ఆస్తి హక్కులను కల్పిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ల పరిధిలో 15 మంది లబ్ధిదారులకు డిప్యూటీ తహశీల్దార్ శంకర్ తో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆస్తి హక్కు కల్పిస్తూ దృువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించిన గొప్ప మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా 59 జి.ఓ కింద ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని సైతం పొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల జీవన విధానంలో మెరుగైన జీవనాన్ని అందించడానికి చేపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ఆర్ ఐ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సలీం, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి, యశ్వంత్, సుజాత కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here