కనులవిందుగా ముగ్గుల పోటీలు

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పండుగ సందర్భంగా మియాపూర్ లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కొమిరిశెట్టి ఫౌండేషన్, విజేత సూపర్ మార్కెట్ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు కొనసాగాయి. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు సంస్కృతి సంప్రదాయాలను అందించటమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని అన్నారు. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 35 కాలనీలలో పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతి కాలనీలో ప్రథమ , ద్వితీయ, తృతీయ, ఐదు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో న్యాయనిర్ణేతలుగా T.వరలక్ష్మి వ్యవహరించారు. స్థానిక మహిళా నాయకురాళ్ళు శ్రీదేవి, అంజలి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు యూసుఫ్ పాల్గొన్నారు.

కనులవిందుగా ముగ్గుల పోటీలు మహిళా నాయకురాళ్ళు, న్యాయనిర్ణేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here