ఐటి కారిడార్ భద్రతే లక్ష్యంగా.. 4 కొత్త స్కార్పియో

  • సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
  • నాలుగు ప్యాట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సిపి
సమావేశంలో మాట్లాడుతున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ జోన్‌లోని ఆర్ సి పురం, నార్సింగి & గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర IPS, నాలుగు కొత్త ప్యాట్రోలింగ్ వాహనాలు ప్రారంభించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పశ్చిమ భాగమని, నార్సింగి, ఆర్‌సీ పురం, తెల్లాపూర్‌, కొల్లూరు, గచ్చిబౌలి ఎక్స్‌టెన్షన్‌ ఏరియాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాలలో SCSC మద్దతుతో నిరంతర పెట్రోలింగ్ కోసం సరికొత్త 4 స్కార్పియోలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ ఏదుల మాట్లాడుతూ, “ఎస్‌సిఎస్‌సి” సైబరాబాద్ పోలీసులతో కలిసి చురుకుగా పనిచేస్తోందని, ఐటి కారిడార్ భద్రతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తెల్లాపూర్, కొల్లూరు, ఆర్‌సి పురం, గచ్చిబౌలి పొడిగింపు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న కమిషనరేట్ ప్రాంతాలలో మెరుగైన పెట్రోలింగ్‌కు మద్దతుగా పోలీసు శాఖకు 4 సరికొత్త స్కార్పియో వాహనాలను అందించినట్లు పేర్కొన్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ తెల్లాపూర్, కొల్లూరు, గచ్చిబౌలి ఎక్స్‌టెన్షన్ ప్రాంతాలు అనేక గేటెడ్ కమ్యూనిటీలతో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో.. ఐటి కారిడార్ ప్రాంత నివాసితులు భద్రత, భరోసా కల్పించేందుకు, అవసరమైనప్పుడు తక్షణమే అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నాలుగు ప్యాట్రోలింగ్ వాహనాలను ప్రారంభించినట్లు చెప్పారు. తెల్లాపూర్ మున్సిపల్ కమీషనర్ బి. శ్రీనివాస్, జాయింట్ కమీషనర్ అవినాష్ మహంతి IPS, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సిపి ప్రారంభించి సరికొత్త నాలుగు స్కార్పియో వాహనాలు ఇవే.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here