మెడికుంట చెరువును సుందరవనంగా, శోభితవర్ణంగా తీర్చిదిద్దుతాం : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మొండి కుంట చెరువు అభివృద్ధి లో భాగంగా రూ. 1 కోటి అంచనా వ్యయం తో చేపడుతున్న చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ పరిధిలోని మొండి కుంట చెరువు అభివృద్ధి లో భాగంగా డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులు వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

మొండి కుంట చెరువు అభివృద్ధి లో భాగంగా డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

మెడికుంట చెరువును సుందరవనంగా, శోభితవర్ణంగా తీర్చిదిద్దుతామని, చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువుల ను సంరక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ నళిని, ఏఈ నాగరాజు , రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ , మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ వార్డ్ మెంబర్ రాంచందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తైలి కృష్ణ, రంగస్వామి, సత్తిరెడ్డి, రవి, శ్రీనివాస్ గుప్తా, లోకేష్, శ్యామ్, కృష్ణ, సర్వార్, సుధాకర్, కృష్ణ నాయక్, నర్సింగ్ నాయక్ పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here