- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి వినతిపత్రం సమర్పించిన జామే మస్జీద్ – ఈ – నూర్ ఖబ్రస్తాన్, ఈద్గా కమిటీ సభ్యులు
నమస్తే శేరిలింగంపల్లి : బక్రీద్ పర్వదినం సందర్భంగా మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ కాలనీలోని జామే మస్జీద్ – ఈ – నూర్ ఖబ్రస్తాన్, ఈద్గా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గాలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల మౌళలి కవసతులు కల్పిస్తూ, ప్రశాంత వాతావరణం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సయ్యద్ అహ్మద్, ఖాసీం, సలీం, షోయబ్, లుక్మన్, రషీద్, అంజద్, పూర్ణ పాల్గొన్నారు.