- ప్రవచనాలు చేసిన మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహ రావు
నమస్తే శేరిలింగంపల్లి : దీప్తిశ్రీ నగర్ లోని శ్రీ ధర్మపురి క్షేత్ర సేవక మండలి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు (24, 25, 26) శ్రీ దేవి భాగవతం కనుల పండువగా నిర్వహించనున్నారు.
వేడుకలలో భాగంగా మొదటి రోజు (నేడు) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహ రావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత) చేపట్టిన ప్రవచనం భక్తి పారవశ్యాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు గరికపాటి ప్రవచనాలు విని తరించారు. ఈ కార్యక్రమంలో భారతీయం సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.