నమస్తే శేరిలింగంపల్లి: మొహర్రం పండుగ మతసామరస్యాన్ని చాటుతోందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బస్తీలో తరతరాలుగా ముస్లింలు, హిందువులు సమైక్యంగా పండుగను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం పండుగ నిలుస్తుందని చెప్పారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ వద్ద నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబుమియా, ముక్తర్, సలీం, ఖాజా, రామకృష్ణ, అంకా రావు, రాయీస్, మహమ్మద్, శమిమ్, అప్రిన్ పాల్గొన్నారు.