- పార్టీ శ్రేణులతో కలిసి స్వాగతం పలికిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : కర్ణాటక రాష్ట్రం శ్రీపరంబుదూర్ నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు చేపట్టిన 33వ రాజీవ్ సద్భావన యాత్రకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.
13వ తేదీ సాయంత్రం సంగారెడ్డి మీదుగా చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నేతృత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేరుకున్నయాత్ర సందర్భంగా వారికి ఇలా ఘన స్వాగతం పలికారు ఆ పార్టీ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, తిరుపతి, దినేష్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, నవీన్ రెడ్డి, సంగారెడ్డి పాల్గొన్నారు.