- ఎమ్మెల్యే కార్యాలయంలో ఎన్నికల ఉల్లంఘన కార్యక్రమాలు…
- రిటర్నింగ్ ఆఫీసర్ కి బొబ్బా నవతారెడ్డి ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల నిధులతో నిర్మించిన ప్రభుత్య భవనం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎన్నికల ఉల్లంఘన కార్యక్రమాలు జరుగుతున్నాయని మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి ఆరోపించారు. ప్రభుత్య ఉద్యోగి ఎమ్మెల్యే ఓఎస్డీ వెంకట కృష్ణ సూచనలు, సలహాలు, సహకరలతో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు, పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఉన్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పోలీసుల సహకారంతోనే జరుగుతున్నట్టుగా ప్రజలు అభిప్రాయం పడుతున్నారని అన్నారు. ప్రభుత్య భవనం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వెంటనే మూసివేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ కి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి డిమాండ్ చేశారు.