మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. డివిజన్ లోని బస్తీలు, కాలనీల్లో కలియదిరుగుతూ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ లో పార్టీ నాయకులతో కలిసి పర్యటించిన ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానిక ప్రజలను ఓటు వేయాలని అభ్యర్ధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకోసం అందించిన సంక్షేమ పథకాలు దేశంలో మరే ఇతర పార్టీలు అందించలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు విజన్ తో పనిచేస్తున్నారన్నారు. మియాపూర్ డివిజన్ ప్రజలు రాష్ట్రం లో జరుగుతున్న అభివృదిని గమనించాలని, టిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, కలిదిండి రోజా, గోపరాజు శ్రీనివాస్, మాధవరం గోపాల్ రావు, ప్రతాప్ రెడ్డి, తాండ్ర రాంచందర్ గౌడ్, లాలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.