మియాపూర్ డివిజన్ లో బిజెపి జెండా ఎగరడం ఖాయం: కె.రాఘవేందర్ రావు

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి):గ్రేటర్ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి కె.రాఘవేందర్ రావు అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, రెడ్డి ఎంక్లేవ్, బికె ఎంక్లేవ్, మయూరి నగర్, కేంద్రీయ విహార్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ కి ఓటు వేయాలని కోరారు.

బీజేపీ కి ఓటువేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థిస్తున్న రాఘవేందర్ రావు

ఈ సందర్భంగా రాఘవేందర్ రావు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అవినీతి పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని, గ్రేటర్ లో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలే పునరావృతమవుతాయన్నారు. హైదరాబాద్ ప్రజలంతా బీజేపీ పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మియాపూర్ డివిజన్ ప్రజలంతా బీజేపీకి ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here