గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తే డివిజన్ ని అన్నివిధాలా అభివృద్ధి పరుస్తానని గచ్చిబౌలి డివిజన్ ఆ పార్టీ అభ్యర్థి అరకల భరత్ కుమార్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా దర్గా లో కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. మరోవైపు భరత్ కుమార్ సతీమణి పూర్ణిమ నల్లగండ్ల లో పాదయాత్ర నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని, ఎన్నో బస్తీలలో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్ గా అవకాశం ఇస్తే డివిజన్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని అయన వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.