ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పవిత్ర క్రిస్మస్ పండుగ ఘనంగా జరిగింది. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ షారోన్ చర్చ్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని దీప్తి హిల్స్, ఇజ్జత్ నగర్, వీకర్ సెక్షన్ బస్తీలో ఏర్పాటు చేసిన వేడుకల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేశారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని క్రిస్మస్ వేడుకల్లో  శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి  జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే ఏకకై పండుగ ఏసుక్రీస్తు పుట్టిన రోజు అని, క్రిస్మస్ పండుగ ఎంతో పవిత్రంగా భావిస్తారని, ప్రజలందరిపై ప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేస్తూ…

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, కొండాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరేందర్ గౌడ్, కృష్ణ గౌడ్, బ్రమ్మయ్య యాదవ్, గంగాల గణేష్ యాదవ్, సాంబశివరావు, రామచందర్, డాక్టర్ ప్రసాద్, కృష్ణ నాయక్, కేశవులు, కోటేశ్, సయ్యద్ ఫాజిల్, షకీల్, స్వామి, హుస్సేన్, కార్తిక్ గౌడ్, చక్రి, రవి కుమార్ గౌడ్, హరీష్ గౌడ్, ఆసిఫ్, బాలు మహేందర్, నవీన్, సురేష్, రాంబాబు, అశోక్ గౌడ్, పతి ప్రవీణ్ కుమార్, శిరీష్, సత్యరాజ్, శ్రీకాంత్, రాజు రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న క్రిస్టియన్ సోదర, సోదరీమణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here