మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారాన్ని మియాపూర్ డివిజన్ లో స్థానిక అభ్యర్థి కె.రాఘవేందర్ రావు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శనివారం బీజేపీ నాయకులు డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ ఎస్టేట్స్, ప్రగతి ఎంక్లేవ్, నీలిమ గ్రీన్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రావు మాట్లాడుతూ బిజెపి అధిష్టానం మేనిఫెస్టో లో ప్రకటించిన హామీలు అన్ని వర్గాల వారి అభ్యున్నతిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో టీఆరెస్ ప్రభుత్వ హామీలను నెరవేర్చకుండానే మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు వచ్చారన్నారు.

పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం తో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి జరగాలంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మియాపూర్ ప్రజలు ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.