గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంతగానో ఆదరిస్తున్నారు, తాము నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేషంగా స్పందన లభిస్తుందని ఆ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల అభ్యర్థి అరకల భరత్ కుమార్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్ లలో భరత్ కుమార్ తో పాటు అయన సతీమణి పూర్ణిమ భరత్ కుమార్ లు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పూర్ణిమ స్థానిక మహిళలకు బొట్టు పెట్టి కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా పూర్ణిమ, భరత్ కుమార్ లు మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా మారిందన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. డివిజన్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
