”1980’s మిలిటరీ హోటల్” ప్రారంభం

  • మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : పదిమందికి ఉపాధి కల్పించేలా వ్యాపారం నిర్వహించాడం అభినందనీయమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన “1980’s మిలిటరీ హోటల్” ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ రుచికరమైన వంటలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందాలని అన్నారు. వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సొంతంగా వ్యాపారం చేయడం కాకుండా పదిమందికి ఉపాధి కల్పించడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,1980’s మిలిటరీ హోటల్ యాజమాన్యం శ్రీకర్ వైట్ల, ఫణి కే వర్మ, సాహు గారపాటి, హరీష్ పెద్ది, నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షులు జలేందర్ రెడ్డి, నల్లగండ్ల హుడా కాలనీ ఉపాధ్యక్షులు రంజిత్ పూరి, ప్రధాన కార్యదర్శి భరత్, సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు ప్రకాష్ నాయక్, కృష్ణ నాయక్ , వెంకటేష్, నర్సింగ్ రావు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here