- గుండె సంరక్షణ పై సిటిజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వాక్ ధాన్
నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం శేరిలింగంపల్లి లోని సిటిజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వాక్ ధాన్ నిర్వహించారు. గుండె సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ భేల్ చౌరస్తా వరకు వాక్ దాన్ చేశారు. కార్యక్రమాన్ని ఆసుపత్రి రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి డాక్టర్ ప్రభాకర్ ప్రారంభించి మాట్లాడుతూ దైనందిన జీవితం ఒత్తిడితో కూడుకున్నదని, తగినంత నిద్ర లేకపోవడం.. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
సాధ్యమైనంత వరకు గుండెకు ఒత్తిడి కల్పించకుండా ఉంటే రోగాలు దరి చేరకుండా ఉంటాయన్నారు. ప్రతి ఏటా హృద్రోగ దినోత్సవం సందర్భంగా సిటిజన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు.. సదస్సులను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గుండె సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలి అంశంపై ప్రజల్లో అవగాహన కలిగినప్పుడే రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు నడక, వ్యాయామం దినచర్యలో భాగం కావాలన్నారు. ఆసుపత్రి సీనియర్ హృద్రోగ నిపుణులు డాక్టర్ సుధీర్ కోగంటి మాట్లాడుతూ ఒళ్ళు నొప్పులు, నీరసం, నిద్రలేమి, ఆందోళన, కోపం, అసహనం, మతిమరుపు వంటివి గుండె జబ్బుకు ముందస్తు సూచనలుగా అనుమానించాలని పేర్కొన్నారు.
ముందుగా పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు అన్నారు. గుండెపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలనిసూచించారు. మారిన జీవన శైలి మానసిక ఒత్తిడిలు, ఆహారపు అలవాట్లలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తం సరిగ్గా ప్రవహించక పోవడం తదితర కారణాలవల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎటువంటి సూచనలు కలిగితే వైద్యులను సంప్రదించి గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవ్వు పదార్థాలను తగ్గించి, మంచిది అన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.