శారీరక మానసిక దృఢత్వం యోగాతో సాధ్యం

నమస్తే శేరిలింగంపల్లి : యోగా వెలకట్టలేని అమూల్యమైన భారతీయ సంప్రదాయం, యోగాసనాలతోనే శారీరక దృఢత్వం,  మానసిక వికాసం పెంపొందుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. కొండాపూర్, మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో యోగాసనాలు చేయిస్తున్న బొటానికల్ గార్డెన్స్ యోగా గురువు బల్విందర్ సింగ్ యాదవ్

ఈ వేడుకలలో బొటానికల్ గార్డెన్స్ యోగా గురువు బల్విందర్ సింగ్ యాదవ్, ఆయన టీమ్ సభ్యులు, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులతో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన వరుమ ఈ కామర్స్ (ఆన్లైన్ క్లాత్స్)  సంస్థ వారి యోగా డే స్పెషల్ టీ షర్ట్స్, బ్రౌచర్ , ఆవిష్కరించారు. ప్రతీ ఒక్కరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా వల్ల కలిగే  ప్రయోజనాల గురించి తెలపడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉద్దేశమన్నారు.

యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ…

ఈ కార్యక్రమంలో రాజు శెట్టి, సీనియర్ నాయకులు ఆకుల లక్ష్మణ్, జితేందర్, గోవర్ధన్ రెడ్డి, గణేష్ , శివాసింగ్, శివరాజ్ , శ్రీను.జే, రవి నాయక్, పద్మ, వరలక్ష్మి, మేరీ, రేణుకా, పార్వతి, భాస్కర్, వంశీ, అశోక్, భాస్కర్, నవీన్ రెడ్డి,గోపాల్, ఉమేశ్వర్, నరసింహ యాదవ్, శ్రీనివాస్ , నరేష్, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here