- బేగంపేట విమానాశ్ర యానికి భారీగా కార్యకర్తలతో వెళ్లి స్వాగతం పలికిన
- శేరిలింగంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇన్చార్జి రవి కుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రధాని నరేంద్రమోడీ మంత్రిమండలిలో కేంద్ర మంత్రిగా, సహాయ మంత్రిగా పదవులు పొంది సొంత రాష్ట్రానికి విచ్చేసిన గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికారు. శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంపేట్ విమానాశ్రయానికి భారీగా చేరుకొని వారికి కార్యకర్తలతో సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి అంచెలంచెలుగా పదవులు పొందుతూ తమలాంటి ఎంతోమందికి అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నూతనంగా కేంద్ర మంత్రిగా, సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తమ సొంత రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రులకు ,ముఖ్య నేతలకు శుభాకాంక్షలు చెప్పారు. రేపు రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని, 2029లలో జరిగే సాధారణ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో తెలంగాణలో జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు, నాయకులు కూడా కంకణ బద్ధులై పార్టీ నిర్ణయించిన విధివిధానాలను పాటిస్తూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం సాగించాలని తెలిపారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, మహిళ మోర్చా, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.