ఆరోగ్యం, హక్కులు, భద్రత పట్ల మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 35 కాలనీలలో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు తారానగర్ లో ని విద్యానికేతన్ హైస్కూల్ వద్ద బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, ఎంవిఆర్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జంట సర్కిళ్ళ పరిధిలో వివిధ మహిళా సంఘాలకు చెందిన మహిళా మణులు 75 మందిని శాలువా సత్కరించి బహుమతి అందజేశారు.

ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మిని సత్కరిస్తున్న ఎంవిఆర్ గ్రూపు చైర్మన్ మూలా వెంకటేష్ గౌడ్ , మహిళామణులు

ప్రతి కాలనీలో జరిగిన మూడు రకాల పోటీలలో విజేతలైన మహిళా సోదరీమణులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు మొత్తం 210 అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి, ఎంవిఆర్ గ్రూపు చైర్మన్ మూలా వెంకటేష్ గౌడ్ హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఆచార్య విజయలక్ష్మి మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలంలో అనునిత్యం నిర్విరామంగా ప్రజా చైతన్యాన్ని అందించే కార్యక్రమాలతో తీరికలేని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు అశేషంగా విచ్చేసిన మహిళామణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వెలకట్టలేని శ్రమను పంచుతూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే వారు మహిళలేనని, ప్రధానంగా స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల, తమ హక్కుల పట్ల, తమ భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వాణి సాంబశివరావు, ఉమా చంద్రశేఖర్, విజయలక్ష్మి , రాణి యాదవ్, రజని, జ్యోతి, సుశీల మరియు ఫ్రెండ్స్ వెల్ఫైర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, పాలం శ్రీను, అమ్మయ్య చౌదరి, దొంతి రాజు, ప్రసాద్పా ల్గొన్నారు.


కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి,
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here