మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ఓబిసి మోర్చ రాష్ర్ట అధ్యక్షుడు ఆలభాస్కర్ ను శేరిలింగంపల్లి బిజెపి నాయకులు బోయిని మహేష్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తాజాగా మహేష్ యాదవ్ ఓబిసి మోర్చ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం రాష్ర్ట బిజెపి కార్యాలయంలో ఆల భాస్కర్‌ను కలసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ర్టంలో ఓబిసి వర్గ ప్రజల అభ్యున్నతికి, పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు ఓబిసి రాష్ర్ట కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు ఆల భాస్కర్ రాజుకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.