నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా సందర్బంగా చేనేత హస్త కళా ఉత్పత్తులు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి.
శ్రీకాళహస్తి చెక్కాణం విగ్రహాలు, ఆర్టిఫిషల్ జ్యువలరీ, మెటల్ క్రాఫ్ట్స్, చిన్న పిల్లలకు పట్టు ఫ్రొక్స్, పట్టు లంగాలు, బేడీషీట్స్, రజాయి, లేఅథర్ చెప్పులు, ముత్యాల హారాలు, వివిధ రాష్ట్రాలకి చెందిన చీరలు మరెన్నో ఆకట్టుకున్నవి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జ్యోతి రెడ్డి శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన, అర్చన మిశ్ర తన శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.