- కృషి నగర్ కాలనీ, జేపీ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీ మెయిన్ రోడ్డులో తలెత్తిన డ్రైనేజ్ సమస్యను, జేపీ నగర్ కాలనీలో నూతనంగా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టబోయే పరిసర ప్రాంతాలను వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి అధికారులు స్థానిక నాయకులు కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీ కాంత్ మాట్లాడుతూ కృషి నగర్ కాలనీలో తలెత్తిన డ్రైనేజ్ సమస్యను తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని, జేపీ నగర్ కాలనిలో వెంటనే నూతనంగా నిర్మాణం చేపట్టబోయే సి,సి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కృషి నగర్, జేపీ నగర్ కాలనీల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి డి ఈ దుర్గా ప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్ నవీన్, స్థానిక నాయకులు మార్రపు గంగాధర్ రావు, రామాంజనేయులు, అన్ని రాజు, వెంకట్ రెడ్డి, అశోక్, శివ ముదిరాజ్, నాగరాజ్ యాదవ్, సుధాకర్, గంగారాం , కిషోర్, వాటర్ వర్క్స్ వర్క్ ఇన్స్పెక్టర్ లింగయ్య , పాల్గొన్నారు.