నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డినగర్ కాలనీలోని బక్షి కుంట చెరువు సుందరీకరణలో భాగంగా ఫెనోమ్ పీపుల్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపడుతున్న సుందరీకరణ పనులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బక్షి కుంట చెరువుకు దశదిశ మారినదని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినదని, నేడు సుజల జలంతో అపురూప దృశ్యకావ్యంగా ఆవిష్కృతమైనదని తెలిపారు. చెరువు కట్ట చుట్టూ చెట్లు పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని చెప్పారు. చెరువుల సుందరీకరణకు ఫెనోమ్ పీపుల్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ముందుకు రావడం అభినదించదగ్గ విషయమన్నారు. సాఫ్ట్ వెర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిన్నట్లు తెలిపారు.
చెరువులు కలుషితం కాకుండా.. కబ్జాలకు గురికాకుండా పూర్తిస్థాయిలో సంరక్షిస్తామని, చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి, ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి చైతన్య, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్ర కాంత్ రావు , సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.