ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో.. ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

  • కార్పొరేటర్లతో కలిసి జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండావందనం సమర్పించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తూ..

భారత దేశ, తెలంగాణ రాష్ట్ర, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయ మిత్రులకు 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ జోహార్లు అర్పించారు. ప్రజాభివృద్ధే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.

జాతీయ జెండాకు వందనం చేస్తూ..

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here