నమస్తే శేరిలింగంపల్లి: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా.. ఆయా లోతట్టు ప్రాంతాల్లో కలిగే ఇబ్బందులు, ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి స్థానిక నాయకులతో కలసి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మదీనగూడా కిన్నెర గ్రాండ్ హోటల్, వైశాలి ఎనక్లేవ్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేస్తుందని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, ప్రజలు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని సూచించారు. ఈ కార్యక్రమంలో పి.వెంకటేష్ గౌడ్, పి.వరప్రసాద్ రావు, వరుణ్ రెడ్డి, వేణు, నాగేశ్వరరావు, సోమయాజులు, రిషికేశ్వర రావు, గోపి రెడ్డి, వెంకటేష్, పార్థసారధి, వసంత్ కుమార్, పావని, రజిని, పార్వతి పాల్గొన్నారు.