నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీలలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో , ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , సమస్యలను పరిగణలోకి తీసుకొని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కాలనీలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను, తాగునీటి పైప్ లైన్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, ముఖ్యంగా డ్రైనేజి, తాగునీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తామని, డివిజన్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC ఈ ఈ శ్రీక్రాంతిని, ఏ ఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్లు రఘు, నవీన్ పాల్గొన్నారు.
