అనుమతి లేకుండా హుక్కా సెంటర్ నిర్వహణ

  • హుక్కా సేవిస్తూ పట్టుబడిన యువకులు
  • కేసు నమోదు.. హుక్కా సామాగ్రిని స్వాదీనం చేసుకున్న పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి : ది బాక్క్యార్డ్ కేఫ్ లో మంగళవారం ప్రభుత్వ అనుమతి లేకుండా హుక్కా సెంటర్ ని నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు తనిఖీలు చేశారు. కింగ్స్ డ్రైవ్ పక్కన ఉన్న ఈ సెంటర్ లో కొంతమంది యువకులు హుక్కా సేవిస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్బంగా కేఫ్ యజమాని కె. సాయి కిరణ్ గౌడ్, మేనేజర్ ఫణి కుమార్లతో పాటు హుక్కా సర్వ్ చేస్తున్న ఈ. వంశీ గౌడ్, మహమ్మద్ సర్ఫరాజ్, అక్బర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హుక్కా పాట్స్, హుక్కాపైప్స్, హుక్కా (మజాక్ , డబల్ ఆపిల్, పాన్ రస్నా) ఫ్లేవర్, 10 హుక్కా హెడ్స్ లను స్వాదీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here