శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): భవన నిర్మాణ కార్మికులకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రభుత్వ గుర్తింపు కార్డులు, యూనియన్ గుర్తింపు కార్డులను భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణం కార్మికులకు ప్రభుత్వం తరపున గుర్తింపు పొందిన కార్డులను అందజేయడం జరిగిందని తెలిపారు.
కార్మికులకు కార్మిక సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు PAC చైర్మన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవనిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీరామ్, కమిటీ సభ్యులు వికాస్, మాధవ్, రమేష్, ఆనంద్ సోంబాబు, చిన్నా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.