శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని స్ప్రింగ్ వ్యాలీ కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఆరెకపూడి గాంధీ సన్మానించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ స్ప్రింగ్ వ్యాలీ కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ప్రింగ్ వ్యాలీ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ రత్న ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సాయి చౌదరి, వైస్ ప్రెసిడెంట్ DVS మనోజ్ కుమార్, జనరల్ సెక్రెటరీ చైతన్య కుమార్, జాయింట్ సెక్రటరీ రాజేష్ మనీష్ సియాల్, ట్రెజరర్ నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.