శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): అటల్ బిహారీ వాజ్‌పేయి శత దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మియాపూర్ ఆల్విన్ కాలనీ శ్రీయ బ్యాంకిట్ హాల్ లో బీజేపీ నాయకుడు కేశవ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి చేసిన సేవలను గుర్తు చేస్తూ నేటి తరానికి ఆయన చేసిన సేవలు అందరికీ తెలిసే విధంగా సెమినార్, ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాజ్‌పేయి తన వాక్చాతుర్యం, రాజనీతిజ్ఞత, దేశభక్తితో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని కొనియాడారు. ఓటమి, విజయం జీవితంలో భాగం అని, వాటిని సమ దృష్టితో చూడాలని, ఇది ఆయనలోని సమచిత్తాన్ని, జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించే తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలుకొని కార్గిల్ యుద్ధం వరకు భారతదేశ పరాక్రమాన్ని కాపాడిన నేత అని అన్నారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఇప్పటికీ మన మధ్యలో ఉన్నాయని అందుకే ఆయనను రాజకీయ భీష్ముడు అని అభివర్ణిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవరావు, రామరాజు, మణిభూషణ్, అశోక్, వసంత్ యాదవ్, రమణయ్య రాధాకృష్ణ యాదవ్ , నరసింహ చారి, వినయ, పద్మ, మహేష్ యాదవ్ ,జితేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.