శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు మద్ది కాయల ఓంకార్ 17వ వర్ధంతికి ముఖ్యఅతిథిగా హాజరైన యం సి పి ఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి.. ఓంకార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రవి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రావడంతో హైదరాబాద్ సంస్థానంపై కమ్యూనిస్టులు ఆధిపత్యం పెరుగుతుందని తెలంగాణలో కమ్యూనిస్టుల రాజ్యం ఏర్పడుతుందని నాటి కేంద్ర ప్రభుత్వం హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు సైనిక చర్యకు ఆదేశించారని అన్నారు. భారత సైన్యాలకు నిజాం సైన్యం దాసోహం అన్నదని, దీంతో సాయిధ రైతాంగ ప్రతిఘటన దళాలపై కేంద్ర సైన్యం సాగించిన దాడుల్లో వేలాదిమంది వీర యోధులు అమరత్వం పొందారని అన్నారు. అదే సందర్భంలో ఆంధ్ర మహాసభ పేరుతో కొంతమంది నాయకులు సాయుధ పోరాట విరమణ చేయాలని ప్రతిపాదన చేశారు కానీ భాషా సంయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని విశాలాంధ్రలో ప్రచారం ఏర్పాటు చేయాలని లేవీ గల్లీలను ఎత్తివేయాలని వెట్టి చాకిరి రద్దు చేయాలని భూ పంపకం జరపాలనే తదితర ప్రజా డిమాండ్లతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగాలని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఓంకార్ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ పిలుపులో భాగంగా ఓంకార్ నర్సంపేట తాలూకా ఉద్యమాలను నడుపుతూ ఐదుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నికై అనేక దాడులు దౌర్జన్యాలకు కత్తిపోట్లకు గురి అయి మృత్యుంజయుడిగా ఉద్యమాలను కొనసాగించారని అన్నారు. మద్ది కాయల ఓంకార్ 17వ వర్ధంతిని నల్లబెల్లిలో నిర్వహించడం ప్రజలకు గర్వకారణం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కుంభం సుకన్య, వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్, సభ్యులు పి భాగ్యమ్మ, మధు, శివాని, రాజు తదితరులు పాల్గొన్నారు.





