శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్న నవీన్ యాదవ్ నామినేషన్ ఊరేగింపులో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం షేక్ పేట మండల ఆఫీస్ కు ఊరేగింపుగా వేలాదిమంది డప్పు చప్పుళ్లతో, బతుకమ్మలు బోనాలు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఊరేగింపు నిర్వహించి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపు ఖాయమని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యువజన సంఘం అధ్యక్షుడు కుమార్ యాదవ్, యువ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్, సినిమా ఆర్టిస్ట్ సత్యనారాయణ యాదవ్ పాల్గొన్నారు.






