స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఎన్‌టీఆర్ న‌గ‌ర్ వాసుల విన‌తి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీకి చెందిన సీనియర్ నాయకులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్‌ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సిసి రోడ్డు, యూజీడీ పైప్ లైన్ నిర్మాణం పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వసతిని మెరుగుపర్చాలని, వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న‌ కాల‌నీ వాసులు

దీనికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, దశల వారిగా చేప‌ట్టి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్ నాయకులు రాజు నాయక్, శ్రీనివాస్, రఘురాం రెడ్డి, కట్టెల శ్రీను, శ్రీనివాస్, మురళీ మోహన్ చౌదరి, రమేష్,నరేందర్ యాదవ్, యేసు దాస్, కలియ నాయక్, కృష్ణ, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here