శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యం అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సమాజ సేవలో శ్రీ కృష్ణా యూత్ ఎల్లపుడూ ముందడుగు వేస్తూ ముందుకు సాగుతుందన్నారు.
ఎంతో మంది వ్యాధిని గుర్తించలేక వైద్యానికి దూరమవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని, రోగికి వచ్చిన వ్యాధిని గుర్తించలేక హాస్పిటల్‌కి వెళ్లే స్థోమత లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ పోషణలో భాగంగా రోజూ కూలి పనులకు వెళ్లి సరైన ఆహారం లేక కాలుష్యం వలన రోగాల బారిన పడుతున్నారని, అలాంటి వారికి వెన్నుదన్నుగా శ్రీ కృష్ణా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా గొప్ప పరిణామం అని అన్నారు. ప్రతి ఒక్కరూ మద్యానికి దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే స్పందిస్తామని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పల్లపు సురేందర్, అనిల్, రోహిత్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ పి.శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కృష్ణ యూత్ రాష్ట్ర ప్రెసిడెంట్ అభిషేక్ గౌడ్, నల్లగండ్ల ప్రెసిడెంట్ ఆదిత్య ముదిరాజ్, హనుమంతు, సతీష్ చారి, శివానంద రెడ్డి, హృతీష్ యాదవ్, కిరణ్, అంకుష్ సింగ్, సాయినాథ్, శ్రీకాంత్ యాదవ్, సంగమేష్, గోపాల్, దేవేందర్, మూర్తుజ తదితరులు పాల్గొన్నారు.