మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ సమక్షంలో టీయూడబ్ల్యూజే లో చేరిన సీనియర్ జర్నలిస్టులు

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ సమక్షంలో శేరిలింగంపల్లికి చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు టియుడబ్ల్యూజేలో చేరారు. టిఎఎస్‌యుడబ్ల్యూజే శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్ లు మరికొందరు జర్నలిస్టులతో కలిసి టియుడబ్ల్యూజేలో చేరారు. నూతనంగా యూనియన్ లో చేరిన వారిని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ. ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు.

టీయూడబ్ల్యూజేలో చేరిన జ‌ర్న‌లిస్టుల‌తో అల్లం నారాయ‌ణ

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని అల్లం నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విఠ‌ల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, జర్నలిస్టులు శశిధర్ శాస్త్రి, మహేష్ కుమార్ చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here