శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శేరిలింగంపల్లి నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె బీఆర్ఎస్ భవన్‌కు తరలివెళ్లి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ జెండాను ఎగుర వేస్తామని అన్నారు.






