శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): కుత్బుల్లాపూర్ గోకుల యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యాదవ కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంది యాదవులను ఒకచోట చేర్చి యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన గోకుల యాదవ సంఘంను అభినందించారు. ఈ సమయంలో యాదవుల ఐక్యత అవసరమన్నారు. యాదవ నాయకులు ముందుకొచ్చి బీసీల రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల తరఫున యాదవ సంఘం నాయకులు యాదవ ప్రజలు కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో బీసీ ప్రజానీకానికి సేవ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, సర్పంచుల ఫోరం వ్యవస్థాపకుడు భూమన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందెల కుమార్ యాదవ్, రాజశేఖర్ యాదవ్, రవి యాదవ్, శివకుమార్ యాదవ్, గోకుల యాదవ సంఘం సభ్యులు, యాదవ ప్రజలు పాల్గొన్నారు.





