శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పది రోజుల ఈ ఉత్సవ్ లో దాదాపుగా 80 చేనేత హస్తకళా ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగళూరు నుండి వచ్చిన భరతనాట్య కళాకారిణి తనుశ్రీ తన ప్రదర్శనలో నిర్వహించిన మహాకాళి కీర్తన, శివ కీర్తన, శ్రీ రామచంద్ర భజన ఎంతగానో అలరించాయి. మహారాష్ట్ర పూణే నుండి వచ్చిన ప్రముఖ కథక్ నాట్య గురువు నీలిమ దేష్పాండే శిష్య బృందం మహాశివశంభో, దక్షయజ్ఞ, శివ శివద్రుపద్, శివ తాండవ, సుందర్ గోపాలం, వంశీలీల, రుక్మిణీనాయక, నారాయణ్ స్తోత్ర అంశాలను సమృద్ధి, సృష్టి, తన్మయీ, రుద్రాణి, అనిత, మృణ్మయీ, గాయత్రీ, యోగేంద్రలు ప్రదర్శించి మెప్పించారు.






