శేరిలింగంపల్లి, మే10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతున్నామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. నల్లగండ్ల చెరువు నుండి బిహెచ్ఇఎల్ చౌరస్తా ఇండియన్ గ్యాస్ గోడౌన్ నాలా వరకు SNDP అండర్ H-CITI లో భాగంగా రూ. 28 కోట్ల 45 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న ఓపెన్ డ్రైన్ RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం పనులను సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాలాల విస్తరణ పనులతో లోతట్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం అని పేర్కొన్నారు. RCC బాక్స్ డ్రైన్ పనులు నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా స్థానికవాసులకు ఇబ్బంది కలగకుండా రాబోయే వర్షాకాలంలోపు పరిసర ప్రాంతవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకట్ రమణ, డిప్యూటీ సిటీ ప్లానర్ తులసిరామ్, ఎస్ఎన్డిపి జిహెచ్ఎంసీ డిఈ దీరజ్, ఎఈ యుగేందర్, టీపిఎస్ జీషన్ కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్, సాయి, రమేష్, శశి, పాములేటి యాదవ్, వంశీ, హరీష్ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.